హిమాలయం

శుభోదయం 🌹🌹🌹🌹🌹

హిమాలయ సందర్శనం లో నామనసు పాడిన గజల్ …
అంబరాన్ని తాకిన సంబరం ….ఆనందం అనంతం ..

గజల్. విజయ గోలి

ఉషోదయపు తొలివెలుగుల పసిడి వన్నె ఆహార్యం
మేఘమాల జిలుగు తెరల హిమశిఖరపు సౌందర్యం

నగకన్యల నయగారం హిమవనమున మనోహరం
సెలయేరుల స్వరఝరి లో సుందరమే చైతన్యం

అడుగిడగా అంబరమే అందినట్లు సంబరమే
మనసుదోచు వింధ్యాచల వీక్షణమే సౌభాగ్యం

యమునమ్మా భగీరధీ పుట్టినింట పరవళ్ళే
అలకనంద మందాకిని సరస్వతీ త్రయ లాస్యం

భక్తి మీర ముక్కోటి దేవుళ్ల ముక్తి కేదారం
ఆదిశంకరు అద్వైతం అనుభవమే సమైక్యం

నీలాంగిణి శ్రేణులలో నర నారాయణ ధామం
బదరి నాధ దర్శనం భవ బంధాల బ్రతుకు ధన్యం

రజత గిరుల ప్రతిధ్వనించు ప్రణవమైన ఓంకారం
కనులుమూసి మౌనివైతె ధ్యానంలో తాదాత్మ్యం !!

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language