స్నేహములో

గజల్. విజయ గోలి

స్నేహములో మదుగులుంటె మధురిమలే  మరిగిపోవు
చేయిచాచి నెయ్యమంటె నిరసనలే  కరిగిపోవు

వొదిగుంటే ఒప్పుతుంది వినయములే  మాటలలో
భాషదాచి భారమంటె భావాలే కదిలిపోవు

మాయపొరలు తొలగిపోతె విశ్వమంత సుందరమే
ధర్మగుణం దరిచేరితే  దానవతే  బెదిరిపోవు

ఎప్పుడెవరు ఎవరికెవరు జన్మలన్నీ ఋణములతో
మలుపుతిరుగు  మనుషులతో బంధాలే నలిగిపోవు

చెదరనిదే నేస్తమంటె సన్నాయే పాడుతుంది
“విజయ” తోడు నడకంటే వివాదాలే  జరిగిపోవు

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language