సత్యభామ

శ్రీమల్లినాధ సూరి కళాపీఠం ఆంధ్ర ప్రదేశ్
శ్రీ అమరకుల దృశ్యకవి గారి ఆధ్వర్యం
సప్తవర్ణాల సింగిడి 13/11/2020
అంశం-:ఐచ్ఛికాంశం
నిర్వహణ-: శ్రీమతులు గాయత్రి గారు హరి రమణగారు  కవిత గారు
రచన -: విజయ గోలి
ప్రక్రియ -:వచన కవిత
శీర్షిక-: సత్యభామ

అష్టసతులలో ఇష్ట సఖి
శౌరి హృదయ సామ్రాజ్ఞి
స్వాభిమానపు సౌందర్య గని
నడకలలో సొగసుల ఠీవి
సత్యభామగా సాధ్వి విదితం

కొంటెకృష్ణుని కొంగు కట్టిన కోమలాంగి
భామగా గోవిందుని ప్రేమ గ్రంధం
మదనగోపాలునికై  మదనుడే సృజించిన
సమ్మోహన  విరిశరముల పొది

పరమపూజ్యుని పాదక్రాంతునిగా
చేసుకుని స్వాధీన పతికయై
కొలువు తీరిన ప్రబంధ కావ్య నాయిక
జాణతనమున నెరజాణగా నిలిచినది

అందమేలేటి అతివకు అహము అలకలు
అలంకారమై అలరారు వలపుల
అభివర్ణంచ సత్యతో సాటి అందాలె లేవు
గీతకర్తకు గీతగీసి నిలిపివేసిన నీలవేణి

నరకాసురునే వధియించి  వీరవనితగ వినుతి
దీపావళి దివ్యకాంతుల  తేజరిల్లిన దివ్య వనిత
సబల తలవగ సాధించలేని సమరమేలేదు.
మహిని మహిళల కొక మార్పు ఇచ్చిన సత్యభామ

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language