శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
అలిసితివొ సంగమాన సంద్రమా ఆగలేవ
పరుగేల కలువచూడ చంద్రమా ఆగలేవ
ఉదయాలె ఉరిమితేను ఊసేమి మిగిలేనులె
తేనీటి విందుచేతు సూర్యమా ఆగలేవ
కాలం కు కళ్ళెమేసి వినువీధి విహరించగ
మబ్బులనె మరలించీ పవనమా ఆగలేవ
అలకెపుడు తొలకరులే కొరతలో కోరికలే
ఆశెపుడు అందలమే ప్రియతమా ఆగలేవ
విరిమాల లొ దారమే గంధమై బంధముగా
నీ తోడు “విజయమంటె నేస్తమా ఆగలేవ