శ్రీ చక్ర వాసిని

ఆత్మీయ సాహితీ మిత్రులందరికీ

విజయ దశమి శుభాకాంక్షలు 🌺🌺🌺🌺🌺

“శ్రీచక్ర వాసిని విజయ గోలి

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి
అధి దేవతా పరాశక్తి పరమేశ్వరి
నవరాత్రుల నవశోభల
నవ దుర్గల నవ జ్యోతుల
నగ రాజ్ఞి ..నారాయణి
ఆదరించు మము అన్నపూర్ణగా

శ్రీచక్ర నిలయా చిద్రూపిణీ
ఐశ్వర్యదాయిని శ్రీ రూపిణీ
వింధ్య వాసిని విమల స్వరూపిణి
ఆహ్లాదినీ ఆనందినీ అమృత వర్షిణి
కరుణ చూడు మము కాత్యాయిని

విశ్వ శక్తి విశాలాక్షి
జ్ఞానాంబిక జగదీశ్వరి
మహి నేలే మహేశ్వరి
వాగ్దేవి శార్వాణి విభురాణి
అక్షర వరమీయవ.. గీర్వాణి

సిరి మువ్వల పదయుగళి
రంజిల్లగ రాగ రవళి
చిరునవ్వుల సింధూరి
సౌందర్య లహరీ సువాసినీ
స్వాగత మిదే సామ్రాజ్ఞి

మణి ద్వీపపు మహారాణి
సింహ వాహినీ శివాత్మికా
త్రిశూల ధారిణి కపాల మాలిని
మహిషాసుర మర్ధని మహోజ్వల
రాజసాన రావమ్మా రాజరాజేశ్వరి!!
దయ చూడుము మము దాక్షాయణి

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language