రుబాయీ

నా మొదటి రుబాయీ…🌹🌹🌹🌹🌹విజయ గోలి

నినుచూడక నాకనులకు నిదురలేదు కన్నా🌹
మురళివినక నామనసుకు శాంతిలేదు కన్నా🌹
ఒకనిమిషం వేదన మరునిమిషం వేడుకగ🌹
ఊగుతుంది హృదయమే నియతిలేదు కన్నా🌹

శుభోదయం 🌹🌹🌹🌹
రుబాయీ 2

మౌనమేల రాగాలా పిలుపేదిర దొరా🌹
శోధించక మనసుగతిని రావేమిర దొరా🌹
రాధనురా విందుల వేళఇదె మనోహర🌹
వేధించక వేగరార జాగేమిర దొరా🌹

రుబాయీ 3 విజయ గోలి

నందివర్ధనమై నయన మనోహరం నీవె🌹
చెంగలువల చెలిమి పరిమళ సుమహారం నీవె🌹
మది మీటిన మోహనరాగం సమ్మోహనమై🌹
మువ్వలసడి రాయంచల సుకుమారం నీవె🌹

రుబాయీ. 4. విజయ గోలి

కామంతో మూసుకున్న కంటిచూపు ఒంపు🌹

కుళ్ళినట్టి కుక్కశవం వాసనెంతొ ఇంపు🌹

మదమెక్కిన మృగాడి వేటకి లేదు మాటు🌹

అవగుణాలు సరిచేయగ అమ్మకత్తి సొంపు🌹

శుభోదయం 🌹🌹🌹🌹🌹
రుబాయీ 5 విజయ గోలి

ప్రేమెంత గమ్మత్తుగ చేసేరు కన్నయ్యా🌹
నీ మ్రోల మోకరిల్లి వేడేరు కన్నయ్యా🌹
నీవుతప్ప గతిలేదని నీప్రేమ అడగరు🌹
కోరుకున్న మనసు కొలువడిగేరు కన్నయ్యా🌹

రుబాయీ 6.  విజయ గోలి

నవ్వులలో  మువ్వలే రాలినట్లు ఉన్నది🌹

పలుకులలో తేనెలే వొలికినట్లు ఉన్నది🌹

వంపుసొంపు ఒదిగే వసంతమే నీవుగ🌹

రాగాలలొ కోయిలే ఓడినట్లు ఉన్నది🌹

శుభోదయం 🌹🌹🌹🌹🌹

రుబాయి 7. విజయ గోలి

ఆకాశంలో ఆశలు వెతకకు ఎప్పుడూ🌹
గాలిలోన నిలబడి కలలు కనకు ఎప్పుడూ🌹
అడగకనే అన్నీవస్తే అర్ధము ఏముంది🌹
ఆట గెలుపు ఆనందం జారకుఎప్పుడూ🌹

శుభోదయం 🌹🌹🌹🌹🌹

రుబాయి 8  విజయ గోలి

గుండెలోన అలజడిగ నీ అడుగుల సవ్వడి🌹

నిలిచిపోయె అధరముల నీ నవ్వుల సవ్వడి🌹

బృందావన  పిలుపుల మెరిసిన వేణువు రవళి🌹

మౌనానికి మాటనేర్పె తలపుల సవ్వడి🌹

 

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language