రంగు రంగు లోకాన్నే

శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్ విజయ గోలి

“అంధత్వం అంతరంగం”

రంగురంగు లోకాన్నే చూడాలని నాకున్నది
హంగులోని పొంగేమిటొ తెలియాలని నాకున్నది

విరపూసిన పూవుకైన ఎరుకేనా వర్ణమేదొ
పరిమళపు రంగేదని అడగాలని నాకున్నది

అమ్మగొంతు లాలనలో చూపేమిటొ తెలిసింది
పవనానికి రూపుంటే తడమాలని నాకున్నది

హరివిల్లులో విరిసినదే శ్వేతంగా ఏకమైతె
కంటిలోని నలుపుబాధ వదలాలని నాకున్నది

మనసుకన్ను విప్పుకుంటె చెప్పలేని విజయముంది
అంధకారమె లేదంటూ అరవాలని నాకున్నది!!

About the author

vgadmin

Add Comment

By vgadmin
Language