శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్ విజయ గోలి
మనాదితో మౌనంగా మనసునిన్నె కోరుతుంది
కనుల బాస ఊసులతో కలత బాప వేడుతుంది
మునిమాపు వేళలలో ముంపులోన నా కన్నులు
మసకేసిన చూపులతో నీకొరకే వెతుకుతుంది
అమావస్య నిండుకున్న అడవిలోన మిణుగురుగా
నీ దారుల చిగురాశల కాంతిపూలు పరుస్తుంది
గాయమేగ ఆభరణం దోచబడిన హృదయానికి
నిలువుటద్దం నీ నీడల ప్రతిరూపం చూపుతుంది
ఎడబాటున ప్రేమకెపుడు వేసవితో జగడాలే
మల్లెపూల బాణాలతొ వేటాడుతు సలుపుతుంది