మనసు విజయ గోలి
మనసెపుడూ గుసగుసగా
ఊగులాడుతుంది
నిదురలోన కలలతోటి
మెలుకువలో ఊహలలో
ఊసులాడుతుంది
ప్రేమపంచు దారులలో
పెనువెలుగై నిలుస్తుంది
ఉలికి పడిన ప్రతిసారి
ఊరడిస్తు వుంటుంది
దిగులు పడిన ప్రతిసారి
వెన్ను నిమురుతుంటుంది
మాటగా చెప్పలేనివి
మనసెపుడు దాచలేదు..
కనుల చూపు నీ భావం
మాయలాడు మాటలతో
మోసగించకు మనసుని
మనసు లేని మనిషంటే
చెప్పగాను మాటలేదు
మంచితనం మానవత్వం
నింపుకుంటె మనసు నిండా
దారెపుడూ సుమవనమే