ప్రోత్సాహం

అంశం-:ప్రోత్సాహం ఒక దీవెన…
శీర్షిక-:భుజం…వచన కవిత్వం
రచన-:విజయ గోలి

నీ మొట్ట మొదటి రోదనకు
నీ చిరునవ్వుల జల్లులకు
అమ్మ అను తొలి పలుకుకు
అమ్మ స్పందనే ప్రోత్సాహం..

తప్పటడుగు తరుణంలో ..
వ్రేలుపట్టి నడక తోడుగ
నడత నేర్పిన నాడు
నాన్న నీడే ప్రోత్సాహం

అక్షరాలు దిద్దు రోజు
చేయిపట్టి ముద్దుగా
చదువు విలువ నేర్పిన
గురువులదే ప్రోత్సాహం

అడుగడుగున నీ బాటలో
ఆసరాగ అందంచిన చేతులెన్నో
విజ్ఞతతో విచారించి..అందించు
నీ ప్రోత్సాహం ..అందని ..కొందరికైన …

జీవితాన ఉన్నతంగ ఎదగాలంటే…
భుజంతట్టి బుజ్జగించి..నిలపెట్టే..
మనసొకటి ప్రతి మనిషికి తోడుంటే
అంబరమే అవలీలగ అందుకదా…

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language