శుభోదయం🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
పెదవిదాటి మాటరాక ప్రేమమదినె దాగింది
కనురెప్పలు దాటిరాక కలలోనే కాగింది
నెలవంకతొ జగడాలతొ రేయంతా గడిచింది
సడిచేయని సమీరమే సరసంగా తాకింది
పుష్యమాస పున్నాగల సుగంధాల పరిచయం
వనమంతా వలపుమత్తు నవరాగం పాడింది
పారిజాత పరుపులపై నీఅడుగుల సవ్వడికె
మంచుపూల జల్లులలో మధువనమే వేచింది
నా శ్వాసల ఊసు నీవె.. నీ ధ్యాసల ఆశ నేను
పిలువకనే నీ పిలుపుగ వీనులనే సోకింది..