నీ సమయం

శుభోదయం 🌹🌹🌹🌹🌹

గజల్. విజయ గోలి

నీ సమయం ఒక్క క్షణం నా పేరున జమ చేయవ
తొలి వెలుగులు తోడవ్వగ చేయిపట్టి నడి చేయవ

పెదవులపై రాస్తున్నా నీపేరే పల్లవిగా
యుగళ గీతి పాడేయగ చరణాలే జత చేయవ

నీ నవ్వుల వెన్నెలలో కనుసన్నల కలలు నావి
పూబాలల పులకింతల పరిమళాలు పరిచేయవ

నడి వేసవి మరుమల్లై వేధించకు మౌనంగా
తొలకరిలో చిరు చినుకుల సందడినే పంచేయవ

చక్రవాక జంటల్లే రేయంతా విరహంతో …
ఉషోదయపు విజయంలో తుషారమై విచ్చేయవ

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language