శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
64446
ఆకాశం అంచులు చూద్దాం నాతో వస్తావా
హరివిల్లును దించుకు వద్దాం నాతో వస్తావా
రెక్కలు కట్టి రివ్వున ఎగిరే గువ్వల మవుదామా
ఎల్లలు దాటి అల్లరి చేద్దాం నాతో వస్తావా
కొండవాలు వాగు లోన గండుమీను కానొచ్చే
వాటంగా వలనే వేద్దాం నాతో వస్తావా
చెరువుగట్టు చెంగలువ చెలిమికి పిలిచె
చేయి పట్టి పరుగులు తీద్దాం నాతో వస్తావా
కరిగిపోవు కాలంలో వడిలిపోక బాల్యానికి
విజయంగా ఆయువు పోద్దాం నాతో వస్తావా