నవరాత్రి

వనదుర్గ      విజయ గోలి 

ఏడుపాయల వెలసిన వనదుర్గ

నవరాత్రి శోభల నడయాడు దుర్గ

నడిచినంత మేర పావన మంజీరమే

గరుడగంగగ నిరతము నీ పాదాభిషేకమే

 

మంజీర తరగలపై మల్లెపూవల్లె

ఏడుపాయలపైన ఎర్రగన్నేరల్లె

బంగారు బతుకమ్మవై బంతిపూవల్లె

ఇంతులకాచేటి పూబంతివే తల్లి

రంగురంగుల పూల సింగిడులపైన

మహరాణివే ..మదినేలవమ్మా

 

సంబరాల సద్దిబతుకమ్మలెత్తేరు

పసిడిపంటల పసుపుభాగ్యాలనిమ్మా

పూవుకొక్క రీతిగా పూజలే చేసేరు

కలగన్న కోరికల వరములే అడిగేరు

నవ విధంబుల నవరాత్రి పూజలే చేసేము

 

ఏడుపాయల దుర్గవైన

బెజవాడ కనక దుర్గవైన

కలకత్త మహంకాళి వైన

కంచి కామాక్షి వైన

అతివలందరిన కొలువైన వనదుర్గవే

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language