శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
నడి రేయిన జాబిలివై మనసు తలుపు తట్టినావు
కునుకుతున్న వలపులకే మేలుకొలుపు పాడినావు
మనసుమాట కళ్ళు చెప్పు కాల మెలా గడిచినదో
కనురెప్పల నీ రూపం కాపు గానె నిలిపినావు
ఎపుడెప్పుడు తలిచావో మౌనాలను మీటావో
అనురాగం కవనంలో అందంగా చెక్కి నావు
పరవశాన పరిమళాలు ప్రేమలేఖ పంచేనులె
అక్షరాల నవ్వులలో ఆమనినే చూపినావు
ఆకశాన మధువనమే మనకోసం *విజయమాయె
విహరించగ ప్రణయనావ తెరచాపలు ఎత్తినావు