దీపావళి

 

రచన-:విజయ గోలి
ప్రక్రియ-:వచన కవిత
శీర్షిక-: దీపావళి

అజ్ఞాన తిమిరాలు అదలించు తల్లీ
విజ్ఞాన దీపాలు వెలిగించు తల్లీ
సిరులిచ్చు శ్రీదేవి సిరిమల్లెగా
దీపాల వెలుగులో జాబిల్లిగా
అరుదెంచె ఇంటింట ఆనంద వల్లిగా
కొలువుండి కోరికలు తీర్చేటి తల్లిగా

విష్ణువే వరాహుడై భూదేవి పెళ్ళాడ
పుత్రుడుగ పుట్టిన నరకాసురుడు
తల్లిచేతను తప్ప మరణమే లేదన్న
వరముతో అసురుడై చెలరేగె అవని పై
సహనాన నీకు సాటిలేరమ్మా…
తనయుడి పాపమునే మ్రోయలేక
సురులతో కలసి హరిని శరణనగా

విష్ణువు కృష్ణుడిగా ధరణి భామగ పుట్టి
ద్వాపర మందు పుడమి బ్రోవగ
నరకునితో సమరమే సంసిధ్ధముగ
ఘోర రణమున గోవిందుడే మూర్ఛిల్ల
ఆదిశక్తియై సత్యభామ అరిని కూల్చేను.
సమరమున సరిలేని యుద్ధమే చేసేను
అబలలకు సబలగా కీర్తి పంచేను

నరకుని వధతోటి నరకచతుర్దశిగా
మరురోజు అమవాస్య .మంచి రోజుగ
అసురుడి చెర తొలగి ఆనందమాయె ..
దివ్వెలు వెలిగించి దీపావళి మొదలాయె

పాలకడలిన మహలక్ష్మి ..
పుట్టినే యనుచు .పూజలను చేయ దీపావళి
రావణుని దునిమి ..లంకనే వీడి
శ్రీ రామ చంద్రుడే సీతా లక్ష్మణులతో
అయోధ్యనే అలరించిన దినమిదిగ..
దీపావళి మొదలాయె. దివి భువి ఏకముగ

చెడుపైన సమరాన విజయమే దీపావళి
ఇంటింట వెలిగేను దివి తారలే  దివ్వెలుగ

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language