చిరు చినుకులు

శుభోదయం 🌹🌹🌹🌹🌹

గజల్. విజయ గోలి

చిరు చినుకుల కులుకులతో కురిసి పోవె మేఘమాల
పుడమి తల్లి పులకరింత చూసిపోవె మేఘమాల

గగనానికి ఇల కెపుడు దూరమేమి లేదంటూ
ఇంద్ర ధనువు వారధిగా కట్టిపోవె మేఘమాల

జ్ఞాపకాల జాజి పూలు అర విరిసెను చిరు నవ్వుల
కన్నె పిల్ల కలల ఊసు తెలిపి పోవె మేఘమాల

పచ్చనైన చేలపైన పరి పరి మరి కురవబోకె
పసిడి నవ్వు పరిమితిగా పంచిపోవె మేఘమాల

కాగితాల పడవలపై కాలమంత సాగదులే
నడకదారి విజయంగా నిలిచిపోవె మేఘమాల!!

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language