శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
చిరునవ్వులు పంచుతుంటె చింతన్నది చేరనిది
క్షణమంటే ..జాణతనం …పట్టుకోను దొరకనిది
అంతులేని నిరీక్షణల అనుభవమే జీవితం
పదిలంగా దాచుకున్న నెమలీకే తెలిపింది
ఎదుటివాని రాతమార్చ ఎదురెళ్ళకు ఆ బాట
పిలిచి చూడు నీ దారిని రాదారిగ సవరించి
ఉనికి కొరకు ఉన్న గొప్ప చెప్పుకుంటె తప్పేమి ?
పూలగాలి పరిమళమే పూవుపేరు చెప్పింది
మధ్యాహ్నపు మార్తాండుని * విజయ మేదొ తెలిసింది
ఉదయాలను హృదయంతో స్వాగతించ నేర్పింది