చిత్రవీణ సమీక్ష. వసుధా దేవి తిరుమల

శ్రీమతి వసుధా దేవి తిరుమల గారు ఎంతో ఆత్మీయతతో నా “చిత్రవీణ”గజల్
సంపుటి పై వ్రాసిన విశ్లేషణ.మిత్రులు చదివి మీ అభిప్రాయం తెలియజేయ గలరు 🙏🏻🙏🏻. విజయ గోలి🌹🌹

“చిత్రవీణ” – “హృదయరాగం”
(చిన్న విశ్లేషణ)

ఎవరిలో.. ఏ ప్రతిభను నింపి తన
అద్భుత.. సృష్టిని చేస్తాడో… విధాత!..
ఆ.. ప్రతిభను పదిమందిలో
ప్రదర్శితమయ్యే సమయాన్నికూడా..
ఎప్పుడు నిర్ణయిస్తాడో.. తెలియదు..
కానీ.. అలాంటి కళ,.. సాహిత్య..
ఆరాధకుల.. అంతశ్శక్తి
బహిర్గతమైనప్పుడు ఇంతకాలం
ఎలా.. దాచివుంచారు ఇంతటి
ప్రతిభాశక్తిని!.. అని ఆశ్చర్యం వేస్తుంది!..

ముఖపుస్తకంలోని..
“తెలుగుసాహితివనం”..
సాహిత్య సమూహం ద్వారా
నాకు,.. మనందరికీ… పరిచయమైన
శ్రీమతి విజయ గోలి గారు.
అలాంటి ప్రతిభాశాలి… అనటంలో..
ఏమాత్రం అతిశయోక్తి లేదు.

కవిహృదయం అంటే!….
ప్రేమతత్వం.. మనసులోనూ..
హృదయంలోనూ..
చూసే వస్తువులో.. కూడా..
పరిపూర్ణంగా.. నిండి వుండటమే!..
అట్లా కలిగివున్నప్పుడే..
ఏ సాహిత్య ప్రక్రియలోనైనా…
రస రమ్య భావనలు…
ఒలికించ బడతాయి!..

శ్రీమతి విజయ గోలి గారితో
కొద్దికాలంగా ముఖపుస్తక పరిచయం
మాత్రం వుది…
ఈమధ్యనే.. నేను..
విజయగోలి గారిని కలవడము
వారి రచనలు “పిల్లనగ్రోవి” “చిత్రవీణ”
గజళ్ళ సంపుటాలను అభిమానంతో..
వారు నాకు ఇవ్వటం జరిగింది…
“చిత్రవీణ” పుస్తకంలోని గజళ్ళు
చదువుతుంటే నాకుకలిగిన
మధుర భావనలు మీ అందరితో
పంచుకునే చిన్న ప్రయత్నమే
ఈ చిరు “విశ్లేషణ”…

పొరపాట్లు ఏమైనా దొరలితే..
మన్నించవలసినది..

ఇక.. పుస్తకంలోకి వెళదాం..

ప్రముఖ గజల్ కవి..
శ్రీ సూరారం శంకర్ గారు,..
కళారత్న శ్రీ బిక్కి కృష్ణ గారు..
ప్రముఖ గజల్ కవయిత్రి..
శ్రీమతి డా. గడ్డం శ్యామలగారు..
సుప్రసిద్ధ కవయిత్రి…
శ్రీమతి శాంతికృష్ణ గారు
రాసిన ముందు మాటల లోనే
వారి వారి అభిప్రాయాలతో కూడిన..
“చిత్రవీణ” గురించిన పూర్తి
విశ్లేషణ వుంది…

“ఒక కవనం చేయాలంటే స్పందించిన
దృశ్యానికో, వస్తువుకో దేనికైనా..
భావాలు జీవంగా కదలాలంటే..
ఆవస్తువు లోకి పరకాయ ప్రవేశం
చెయ్యాల్సిందే.. అలా మనసుతో
అనుభవించి రాసిందే నిజమైన కవనం”
అంటారు..
“చిత్రవీణ” గజల్ కవయిత్రిగా
“నామాట” లో… “రచయిత్రి”..
నిజమేకదా!.. గజల్స్ చదువుతూవుంటే..
మనక్కూడా ఈ అభిప్రాయమే…
కలుగుతుంది..
//కనుల కొలను తరగలపై ఆడుతున్న
కలనీవుగ
కడలి అలల నురగలపై తళుకుమన్న
కలనీవుగ//
“కనుల కొలను”
పుస్తకం లోని మొదటి గజల్
తొలి మత్లానే ఎంతటి అద్భుతమైన
భావుకత నిండివుందో కదా!..
లలితమైన పదాలు…
గంభీరమైన, లోతైన భావనలు…
గజల్ సౌందర్యం ఏమాత్రం తగ్గకుండా…
ఊయలూగే ఊహను…
ఎంతచక్కగా వర్ణించారో చూద్దాం..
కొలనులైన కనుల నీటి తరగలలో…
అనటం.. బాష్పం.. ఆనందమైనా.. కావచ్చు..
ఆవేదనయినా…
కావచ్చు.. అనే భావం
వ్యక్తమవుతుంది..

ఇలాంటి అత్యద్భుతమైన
మత్లాలే అన్ని గజళ్ళలోనూ..
కనిపిస్తాయి..

ఈ గజల్ చూద్దాం…
//అందివచ్చు అవకాశం అందుకొనుట
తెలియాలి!
ఆశయాల దారులలో అడుగేయుట
తెలియాలి!//

//పూలతోడు ముళ్ళుంటే అదును తెలిసి
తెంపాలి
అడ్డమొచ్చు ఆపదలను అదిలించుట
తెలియాలి!//

//నల్లమబ్బు నీడలెపుడు తోడురావు
కలకాలం
ఎడారిలో ఎదురునడక ఎరిగుండుట
తెలియాలి!//
“అందివచ్చు అవకాశం”
అవకాశాలను వదులుకో కూడదనీ..
ఆశయాల సాధనకై కృషిచేయటం
తెలిసి వుండాలనీ..
కష్టాలలో ఆదుకునే తోడు
కలకాలం వెంటరాదనీ..
ఒటరిగానైనా జీవనపోరాటం
కొనసాగిస్తూ.. ధైర్యం కోల్పోరాదని..
ఆశావహ దృక్పథం తో
జీవితంలోని ఒడిదుడుకులను
ఎలా అధిగమించాలో తెలిపే
అందమైన పదాలలో ఇమిడిన..
భావం.. అపూర్వం కదా!…

“చిత్రవీణ”లో మరికొన్ని
తంత్రుల స్వరాలను ఆస్వాదిద్దాం…

//ఒకసారీ సరాగమై ఒకసారీ వియోగమై
చందమామ కళల తీరు మనసంతా
మంద్రాలే//
“చిత్రవీణ”
ఈషేర్ లో…
జీవన గమనం చంద్రుని కళలతో పోల్చటం
ఎంతో వాస్తవం అనిపిస్తుంది కదా!…
చీకటి వెలుగుల సంగమమేకదా జీవితం!..

//అమావాస పున్నములే అలుపెరుగక
నడచిననూ
ఆశలతో ఎదురుచూపు అలవాటుగ
మారుతుంది//
“కోరుకున్న కలలమేడ”
చీకటి వెలుగులు వస్తూ పోతూవుంటాయి
ఆశలు సడలిపోనివి ఎదురుచూస్తూ
మందుకు నడవాలని చెప్పే.. ఈషేర్
మలచిన తీరు అద్భుతం కదా!…

//ఆడపిల్ల తండ్రులుగా కొందరిదే
ఆనందం
అవనిలోన అమ్మతాను అందరిదే
ఆ బంధం//
“ఆడపిల్ల”
ఆడపిల్ల అంటే తండ్రిగా నిరాశ ఎందుకని
అమ్మగా,మహాలక్ష్మీ స్వరూపమనీ..
తెలిపే గజల్ యొక్క మత్లా… ఇది.

//జమానాలు జల్దిగానె జరిగిపోయె
జర ఆగక
శిథిలాలలొ ప్రేమలనే చిత్రాలుగ
చూపుతుంది//
“కష్టమైన సుఖమైనా”

//మనసుల మెలిగిన వ్యధనే గాధగ
నసీబు రాసిన కితాబు మిగిలెను//
“జారిన ఆమని”
ఈ “పదాల ప్రయోగం” ఎంతచక్కగా
అమరిపోయింది కదా!.. షేర్ లలో…

//తీపి గురుతు ఇచ్చావుగ వీడలేని
బంధంగా!
మరల మరల చదువుకోను మరువలేని
గ్రంధంగా!//
“తీపి గురుతు”
వేదనలో కూడా నిరుత్సాహ పడకుండా..
తీపిగుర్తులైన ఙ్ఞాపకాలే వీడని బంధాలుగా
భావించి.. పదే పదే చదువుకునే…
గ్రంధంలాగా దాచుకున్న.. భావనలో
ఎంతో.. ఆర్ద్రత కనిపిస్తుంది..
ఇంకా.. అమ్మగురించి,.. తెలుగుభాష,..
బాల్యం,… జన్మభూమి.ఇలా ఎన్నో..
రాగాలు మీటిన..
హృదయవీణనే.. ఈ “చిత్రవీణ”

“చిత్రవీణ” లోని ప్రతి మత్లా.. ప్రతిషేర్..
కూడా విశ్లేషణాత్మకమైనవే…
ఒకదాని మించి మరొకటి లాగా…
అద్భుతమైన మత్లాలు…
ఆలోచనాత్మకమైన… భావుకతలతో
చక్కనైన షేర్ లు… కలిగి
సుందరమైన (56)గజల్స్ తో …
తప్పకుండా చదవ వలసిందే…
అనిపిస్తుంది…
శ్రీమతి విజయగోలి గారి “చిత్రవీణ”
గజళ్ళ సంపుటి…

రచయిత్రి విజయగోలి గారికి
అభినందనలు.. 🤝💐💐

వసుధాదేవి తిరుమల

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language