శుభోదయం🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
చరితలన్ని ప్రేమలనే పరిచయించి చూపాయి
పెనవేసిన మనసు కధలు పలుకరించి చూపాయి
ప్రణయమెపుడు మధురమైన అల్లికలే ప్రకృతిలో
ప్రళయమైన వ్యధలెన్నో పలవరించి చూపాయి
ప్రాణాలతొ పాతరేసి పగబట్టిన నైఛ్యములొ
సమాధులనె సాక్ష్యాలుగ నిర్ణయించి చూపాయి
శిధిలమైన కోటలలో శిలలైనవి కలలెన్నొ
త్యాగాలలొ ప్రేమఉనికి వెలువరించి చూపాయి
గుండెగుడిలొ వెలిసివున్న వేలుపేగా ప్రేమంటె
ప్రణవానికి ప్రతిధ్వనిగ అన్వయించి చూపాయి