కొల్హాపురి మహాలక్ష్మి

శ్రీ మల్లినాధ సూరి కళాపీఠం ఏడుపాయల
శ్రీ అమరకుల దృశ్యకవి గారి ఆధ్వర్యం
అంశం-:కార్తీక మాసోత్సవం    కొల్హాపురి మహాలక్ష్మి
నిర్వహణ-: కవి వర్యులు శ్రీ బి వెంకట కవి గారు
సహ నిర్వహణ -: శ్రీమతులు హరి రమణగారు  కవిత గారు గాయత్రి గారు
రచన-: విజయ గోలి

ప్రక్రియ -: వచన కవిత
మరాఠా దేశాన కొల్హాపురి లో
పంచగంగా తీరాన సప్తపీఠముగ
సతీదేవి నేత్రాల శ్రీమహా లక్ష్మివై
సిరుల దేవిగ వెలసినావు

అవని అరచేత కాచిన తల్లిగా
చతుర్భుజముల ,నిడివి కన్నుల
నుదుట చందనం  ఆపై నిండు కుంకుమ
వజ్రంపు మకుటము  ,వారాల నగలతో
నిలువెల్ల నిండైన అలంకారముల
అంబతాయి గ అలరించు తల్లి
అతి బలేశ్వరుడే అయ్యవారిచట

హరి పైన అలిగి  అవని జేరేవు
తపములే చేసి తరియించినావు
కోలాహరుని హతమార్చి
కోరిక పేరున కొల్హాపురము చేసేవు
ఆదిత్యుడే నిత్య పూజలు చేసి
నిను గొలుచు తల్లి..

చతుర్గోపురాల  దీప ధ్వజముల
మహా ప్రాకారాల మహిమాన్వితముగ
శిల్పసౌందర్యాల శ్రీ చక్రరూపమున
విలసిల్లు నీ దివ్య ఆవాసము
పంచ అర్చనలు పండ్లు నైవేద్యాలె
పరమపావనివై  పాలించు తల్లీ

శంఖచక్ర గధా ధారివై
అభయ హస్తమున
ఆదరించేవు అందాల తల్లి
క్షీరాబ్ధికన్యవై  చిరునవ్వుల
కాపాడు మము సిరిమల్లిగా 🙏🏻🙏🏻

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language