కృష్ణం వందే జగద్గురుం

విజయ గోలి.

*కృష్ణం వందే జగద్గురుమ్*

శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితమ్ |
శంఖచక్ర ధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్ ‖🙏🏻🙏🏻

వటపత్రసాయివై వామనుడవై
భువనములు నిండిన భోగివై
మహా యోగివై అంతర్యామివై
మనసునిండినమాధవుడివై
చేయివీడని చెలిమివై ,చేతవై
కలవై ఇలవై కలిమివైతివే ..కృష్ణా🙏🏻🙏🏻
అంతమే లేని మాతృష్ణలే తీర్చగా

చెరసాలను పుట్టి మాయ తెలిపితివి
అడుగడుగు గండాల అలవోకగా పెరిగితివి
శిఖిపింఛమౌళివై చిరుమువ్వల సవ్వడిగ
చిన్నికృష్ణుని వోలె చిరుతనవ్వుల మెరిసితివి
నందగోకులమంత చిందులేయగ కృష్ణా🙏🏻🙏🏻

మన్నుతిన్న నోట మిన్నులను చూపితివి
వెన్నదొంగవోలె వేడుకలు చేసితివి
గోవర్ధనమెత్తి గోకులము గాచితివి
వలువలను దోచితివి విలువలే తెలిపితివి
ఆత్మజ్ఞానము తెలిపి అన్ని నీవైతివే గోపాల🙏🏻🙏🏻

వెదురు వేణువు చేసి రాగాల రంజిల్ల
వెలదుల నడుమ వెన్నుడవై రాసలీలల
వెలిగి తాథ్యాత్మమున తనువు మరిచి
మనసు నీలోన మలుపుట తెలిపితివి
పరము చెప్పి గురువైతివే పరంధామా🙏🏻🙏🏻

కురుక్షేత్రమే నీవుగ
ధర్మము ధరణిపై నిలిపిన నీరజాక్షా
నరుడివై నారాయణుడివై భగవద్గీత బోధించి
విశ్వమే నీవంటు విరాట్ రూపమే చూపి
భవ బంధాల భ్రమలు బాపేవు గోవిందా🙏🏻🙏🏻

శరణంటు చరణములు తాకితే
కడవరకు కర్తవై కాచేవు కన్నయ్య
ధర్మచింతన తోడి దరి చేరువానికి
చక్రివి నీవై చెంత నిలిచేవు చక్రధారి
కర్మఫలములు కాచి పరమపదమున
నిలుప పరిపరి వేడేము పరంధామ🙏🏻🙏🏻

కృష్ణవై విష్ణువై రాముడై రమణుడవై

కాపాడు జగద్రక్షవై🙏🏻🙏🏻🙏🏻🙏🏻

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language