శ్రీ మల్లినాధ సూరి కళాపీఠము ఏడుపాయల
శ్రీ అమరకుల దృశ్యకవి గారి ఆధ్వర్యం
సప్తవర్ణాల సింగిడి 11/12/2020
అంశం -:కార్తీక మహోత్సవములు. కాశీ యాం విశాలాక్షి
నిర్వహణ-: కవివరులు బి వెంకట్ కవి గారు
శ్రీమతులు కవిత గారు. హరి రమణ గారు గాయత్రి గారు
రచన-: విజయ గోలి
ప్రక్రియ-: వచన కవిత
అష్టాదశ శక్తి పీఠముల
సప్తాదశ పీఠమున
అమ్మ విశాలాక్షి కాగా
జ్యోతిర్లింగ స్వరూపుడు
విశ్వనాథుడు స్యంయంభువులు
సతీదేవి వామహస్తము
వరదాయినిగ విశాలాక్షీదేవి
ప్రసన్న వదన యై
కరుణ నిండిన కనుల
జనులగాచు కల్పవల్లి
మహేశ్వరునికే బిక్షనొసగిన
మాత అన్నపూర్ణా దేవి
స్వర్ణాక్షయ పాత్ర తో
ముల్లోక జనని .జగన్మాత
పరమశివుని ప్రతిష్టితగా
పావన కాశీనగర విశిష్ఠత
ముక్తి పురముగ మహిమాన్వితము
పరమ పావన గంగతో
వారణ అసి నదుల సంగమ స్థలి
గంగ స్నానము పాపహరము
పంచభూతములు
పరమ పవిత్రములు
జన్మరాహిత్యములే
జనన మరణములు కాశిలో
మహాదేవుడే స్వయముగా
తారకమంత్ర మిచ్చి తరింప చేయు
కాశీ క్షేత్ర సందర్శనా భాగ్యమే
భక్తి ముక్తి ప్రదాయకము