కలకాలపు చెలిమి

శుభోదయం🌹🌹🌹🌹🌹

గజల్. విజయ గోలి

కలకాలపు చెలిమి నీవు నీ వలపుల తరువు నేను
ఎడబాటున నీ తలపుల హృదినిండిన బరువు నేను

మధువనమున అరవిరిసిన మందారపు మకరందం
పెదవులపై ఆలపించు ఆ మురళీ పిలుపు నేను

జాబిలమ్మ జలతారులు మరిపించే దరహాసం
కరిమబ్బుల కలిసిపోవు నిన్నంటిన నలుపు నేను

రేపల్లియ కంటి దివ్వె ఇంటింటా వెలుగులుగా
వెతలు తీర్చు వెన్నదొంగ వెండిమువ్వ మెరుపు నేను

యముననీడ తారంగపు తరగలపై తారాడిన
విజయములో మాధవునీ మది గుమ్మం తలుపు నేను

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language