శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్ విజయ గోలి
ఎద తగిలిన గాయాన్నే గేయంగా వ్రాస్తున్నా.
హృదిరగిలిన జ్వాలలనే హేయంగా వ్రాస్తున్నా.
ముళ్ళదారి పూలతోట మురిపాలను కలగన్నా
నిన్నటిదే నాస్వప్నం ఖేదంగా వ్రాస్తున్నా.
చితి మంటల వేడిమిలో చలి కాగుతు వణికేనులె
బీడు పడిన భూములపై సేద్యంగా వ్రాస్తున్నా.
ఒంటరిగా దారులన్ని వడగాల్పుల వలయాలే
అడుగడుగున బతుకు ఆశ ధ్యేయంగా వ్రాస్తున్నా
పలుకు ములుకు లోతింకా పచ్చిగానె మిగిలినదీ
విశ్వాసం వెంట నడిచి విజయంగా వ్రాస్తున్నా