ఊపిరిలో నీ పేరే

శుభోదయం🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి

ఊపిరిగా నీ పేరే ప్రియరాగం పాడుతుంది
అలవికాని వ్యధలోనా ఆనందం పంచుతుంది

రాలుతున్న పూవులదే ఇగిరిపోని గంధాలుగ
రాగ రవళి బంధంగా మదిలోపల దాచుకుంది

మరుగుతున్న మనసుపైన మంచుపూల చిలకరింపు
గతమిచ్చిన గుర్తులనే మల్లెలుగా కప్పుకుంది

కల నింపిన కలమెందుకొ ఉలుకాడదు అలకలలో
వొలికించే బాధలోన మధురమైన కవనముంది

వసంతాల వన్నె రాల్చి వలస పోవు గ్రీష్మానికి
తొలిచినుకుల తడుపులకే మొలకలెత్తు “విజయముంది !!

About the author

Vijaya Goli

Add Comment

Language