విజయ గోలి గజల్
ఆశలt నెగళ్ళు వేసవి లాగే వెచ్చగ వెలుగును
ఆమని చిగుళ్ళు అల్లరి చేస్తూ పచ్చగ ఎదుగును
గూటిన గువ్వలు కువకువ మంటూ కూస్తూ ఉంటే
రెక్కల చప్పుడు ఎప్పుడు విన్నా ఇంపుగ మెదులును
పిలుపులు ప్రేమగ పిలుస్తు ఉంటే పలుకని దెవరని
గుండెను గుచ్చక గురుతులు ఎంతో తీపిగ పలుకును
మేఘము చాటున మెరిసిన తీగకు కుదురే లేదుగ
చినుకుల తడిచిన నేలను పంటలు స్థిరముగ పెరుగును
నేనును మరచితె మనుగడ లోనా మనమే ఘనముగ
*విజయము వెనుకన విలువలు ఎన్నో మెండుగ నిలుచును