శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
అడగకు నా చిరునామా అందలేని ఆశనేను
పిలవాలని తలచబోకు చెరిపేసిన బాసనేను
వెతుకబోకు విరివనాల అరుదెంచని ఆమనికై
కనిపించని పరిమళాల నినుచుట్టిన ధ్యాసనేను
ఏరాగం పాడదులే మనోవీణ మౌనమాయె
దివ్వెచుట్టు శలభమునై కరుగుతున్న శ్వాసనేను
చిరువెలుగుల మిణుగురైన కానరాదు నాబాటన
చెమరించిన నీకవనం కలవలేని ప్రాసనేను
ప్రేమబాట ముళ్ళుపరిచి గేయమైన గాయంగా
నీతలపుల తీరాలలొ కడతేలిన గాధ నేను