*ఆజాదీ కా అమూల్య్ నిషాన్ 🇮🇳🇮🇳🇮🇳🕊🕊🦚🦚.
స్వాతంత్ర్య పు రెపరెపలు* విజయ గోలి
షాన్ సే ఉఢ్ రహీ హై ఆజాదీ కా అమూల్య్ నిషాన్ ….
వజ్రోత్సపు వన్నెలతో సంబరంగా ఎగురుతుంది ..
అంబరమే తనదైన ఆనందపు హంగులతో
భరతజాతి సంస్కృతిని …విశ్వమంత చాటుతూ..
గగనవీధుల గర్వంగా ..ఘనమైన …మన జెండా..
సాధు రంగు ,శాంతిరంగు..సస్య శ్యామల రంగు..
మువ్వన్నెల మధ్యన ముచ్చటైన నీలిరంగు.
ధరణి మీద ధర్మానికి చిహ్నంగా ..
విశ్వ దీప్తి రాగంగా ..విజయ పధం సాగుతుంది
స్వాతంత్ర్యపు మెరుపులతో ..మింటినంటి…
ఎదురులేక ఎగురుతుంది ..ఎర్రకోటపై మువ్వన్నెల జెండా
భరతమాత గళమందున మల్లెపూల దండగా
బానిసత్వ సంకెళ్ళు తెగిపడిన చిన్నెలుగా
బలిదానపు యజ్ఞంలో సమిధలైన సమర యోధులకు
దివ్యాంజలి ఘటియిస్తూ దశ దిశలా ..
ఎగరేద్దాం తిరుగు లేని మన తిరంగా
కరకు రాతి తూటాలకు ఎదురొడ్డిన గుండెలకు
దేశమాత శ్వాసకు ..స్వేచ్ఛాయువు లిచ్చిన …
ధీరులకు ..అమర వీరులకు . మార్గదర్శకులకు
మాతృభూమి స్వాతంత్ర్య వెలుగు వేడుకలో..
అర్పిద్దాం అక్షరాల అమృత నీరాజనం
వేదభూమిగ ..వినుతి కెక్కిన
పవిత్ర భారత ధరిత్రి లో పుట్టినందుకు …
గర్వ పడుము భారతీయుడా ..
ఏదేశమేగినా ….భరతజాతి …నాదేనని చెప్పేందుకు… గర్వ పడుము
శిరసు వంచలేదు ఎక్కడా…వంచబోదు మరి ఎక్కడా..
దేశభక్తి గుండెనిండ…చెయ్యెత్తి ప్రణమిల్లు *జైహింద్ *అని
చెయ్యెత్తి ప్రణమిల్లు *జైహింద్ *అని
🇮🇳🇮🇳జైహింద్🇮🇳🇮🇳
మహోన్నత హిమవన్నగ శిఖరమే నాదేశం
ఎలుగెత్తిన వందేమాతర గీతమే నాదేశం
విశ్వవీధిన విహరించే త్రివర్ణమే నాదేశం
వేదవిజ్ఞాన తొలివెలుగు కిరణమే నాదేశం
జైజవాన్ జైకిసానులే జన్మభూమి సిద్ధాంతం
వసుధైక కుటుంబమే సిరివరాల కదంబం
సరిహద్దు త్యాగనిరతి సుస్వరాల సందేశం
నాదేహంలో ప్రజ్వరిల్లు నాదేశగీతి సంస్కారం