అలసిన కన్నుల

శుభోదయం🌹🌹🌹🌹🌹

గజల్. విజయ గోలి

అలసిన కన్నుల అధరపు మధువులు అద్దగ రావో
విరిసిన కలువల విరహపు జ్వాలలు ఆర్పగ రావో

మబ్బుల పరుపుల మల్లెల సొగసులు మౌనము వీడవు
పరువపు ఊసులు రాసిన లేఖలు చదవగ రావో

పికముల పిలుపులొ వలపుల సైగల సరసము వినవో
పున్నమి పూటల పూవుల మాలలు అల్లగ రావో

తరుణము గానవు తలపుల మాటున తాపసి వైతివొ
తారల దారుల వేచిన తరుణిని తాకగ రావో

ఝాములు గడిచిన జాడలు చూపవు వేడుక నీదే…
మన్మధ శరముల విజయం గుట్టును విప్పగ రావో !!

About the author

vgadmin

Add Comment

By vgadmin
Language